Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

95 శాతం కష్టం, 5 శాతం అదృష్టంతోనే విజయం సాధించాను : సివిల్స్ ర్యాంకర్ స్నేహజ

భవిష్యత్తులో విద్య, వైద్య రంగాల అభివృద్ధికి తాను కృషి చేస్తానని సివిల్ సర్వీసెస్ -2015 ఫలితాల్లో 103 వ ర్యాంకు సాధించిన స్నేహజ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తన తల్లిదండ్రులు, మిత్రులు సహకారంతోనే తాను ఈ విజయాన్ని సాధించానని చెప్పారు. 95 శాతం కష్టం, 5 శాతం అదృష్టం అనేవి ఎప్పుడూ ఉంటాయని, గతంలో లక్ ఫ్యాక్టర్ లేకపోవడం వల్లే తాను సాధించలేకపోయానని అన్నారు. ఈ సందర్భంగా ఆమె తల్లిదండ్రులు మాట్లాడుతూ, తమ కూతురు సిఏ చదివినా కూడా దేశానికి సేవ చేయాలనే ఆలోచనలో ఉందని, అందుకే సివిల్స్ వైపు మొగ్గుచూపిందని అన్నారు. ఆమె మంచి అధికారి అవుతుందని, దేశానికి సేవ చేస్తుందని తాము ఆశిస్తున్నామని అన్నారు.

More Telugu News